తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు బాధగా ఉంది :  ఉజ్జల్ భుయాన్

తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు బాధగా ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.  పెద్దపెల్లి జిల్లా నంది మేడారంలో నూతనంగా నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ తెలుగులో మాట్లాడుతుంటే చూశానని చెప్పిన ఆయన.. ఇప్పుడు తాను తెలుగు నేర్చుకుంటానన్నారు. కోర్టు తీర్పులు మాతృభాషలో ఉంటే బాగుంటుందని  ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలన్నారు. కోర్టు ప్రారంభం తర్వాత నంది మేడారంలోని కాకతీయలా కాలం నాటి భారీ నంది విగ్రహాన్ని, త్రికోట ఆలయాన్నిఆయన సందర్శించారు