హైదరాబాద్, వెలుగు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గత నెలతో ముగిసిన మూడో క్వార్టర్ఫలితాలను విడుదల చేసింది. బ్యాంకు కాసా డిపాజిట్లు ఈ క్వార్టర్లో రూ.8,657 కోట్లకు చేరాయి.
అంతకుముందు ఏడాది డిసెంబరులో డిపాజిట్ల విలువ 7,556 కోట్లతో పోలిస్తే 16 శాతం పెరిగింది. క్రెడిట్డిపాజిట్ రేషియో 94 శాతం నుంచి 88 శాతానికి తగ్గింది. గ్రాస్ లోన్ బుక్విలువ 10 శాతం పెరిగి 27,743 కోట్ల నుంచి 30,466 కోట్లకు పెరిగింది. లోన్ డిస్బర్స్మెంట్స్ ఆరు శాతం తగ్గి రూ.5,360 కోట్లకు పడిపోయాయి.