- పిల్లల్లో ఒబెసిటీ పెరుగుతుండటంతో బ్రిటన్ సర్కారు నిర్ణయం
లండన్: బ్రిటన్‌లోని చిన్నారుల్లో పెరుగుతున్న ఒబెసిటీ (ఊబకాయం)ని కట్టడి చేయడానికి ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పగటి పూట టీవీల్లో జంక్ ఫుడ్‌కు సంబంధించిన ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించింది.
వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి జంక్ ఫుడ్ యాడ్స్‌తో పాటు తక్కువ ఆరోగ్యకరమైన ఫుడ్, డ్రింక్స్‌కు సంబంధించిన ప్రకటనలు రాత్రి 9 గంటల తర్వాతే టీవీల్లో ప్రసారం చేయాలని నిర్ణయించింది.