అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి

ఇల్లు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఓ జంట నక్తతోక తొక్కారు. వంటగదిలో తవ్వకాలు జరిపిన వారికి విలువైన 17వ శతాబ్దకాలం నాటి నాణేలు దొరికాయి. రాబర్ట్, బెట్టీ ఫుచ్స్ అనే జంట  దక్షిణ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ డోర్సెట్‌లో 17వ శతాబ్ధానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టన్ ఫార్మ్ 2019లో కొన్నారు. అయితే తాజాగా వారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. తమ వంటగదిలోని కాంక్రీట్ ఫ్లోర్‌ను తొలగించి ఎత్తైన పైకప్పును నిర్మించాలనుకున్నారు. దీనికోసం వంటగదిలో ఫ్లోర్ మట్టి తవ్వారు. అందులో రాజుల కాలం నాటి వెయ్యి నాణేలు బయటపడ్డాయి. 

400 సంవత్సరాల క్రితం నాటి కింగ్ జేమ్స్ I,కింగ్ చార్లెస్ I లకు చెందిన1029 నాణేలు వారికి ఒక పింగానీ కుండలో లభించాయి. ఇవి బ్రిటిష్ మ్యూజియం ఈ నాణేలు 1642,1644 మధ్యకాలం నాటివని గుర్తించింది. వాటిలో కొన్ని ఎలిజబెత్ I వెండి షిల్లింగ్స్, క్వీన్ మేరీ I కాలం నాటి నాణేలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 23న జరిగిన వేలంలో రాబర్ట్, బెట్టీ ఫుచ్స్ లు ఈ నాణేలకు మంచి ధర పలికింది. అక్షరాల రూ.62.88 లక్షలు వారు సొంతం చేసుకున్నారు.