యునైటెడ్ కింగ్ డమ్.. యూకే ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ సత్తా చాటింది. 650 స్థానాలకు.. 359 సీట్లు గెలిచి ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 326 సీట్లకు అధికంగానే.. సొంతంగా పూర్తి మెజార్టీ సాధించింది లేబర్ పార్టీ. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మన్ యూకే కొత్త ప్రధానమంత్రిగా కాబోతున్నారు.
14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కేవలం 80 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరపున ప్రధానిగా ఉన్న రిషి సునక్ ఉన్నారు. దీంతో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత నాదే అంటూ ఆయన ప్రకటించారు.
Also Read:బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు.. ఓటమి దిశగా రిషి సునాక్ పార్టీ!
యూకే కొత్త ప్రధాని కాబోతున్న లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మన్ ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. మొదట దేశం.. ఆ తర్వాత పార్టీ అనే నినాదంతోపాటు ధరలు తగ్గిస్తానని.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని.. వైద్యం రంగంలో విషయంలో మార్పులు తీసుకొస్తానని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తానంటూ ఇచ్చిన హామీలు బాగా పని చేశాయి. కొన్నేళ్లుగా యూకేలో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. దీనికితోడు ధరలు విపరీతంగా పెరిగి ప్రజల ఆదాయం పడిపోయింది. ఇదే లేబర్ పార్టీకి వరం అయ్యింది. ఈ విషయంలో ఏడాది క్రితం ప్రధానమంత్రిని మార్చింది కన్జర్వేటివ్ పార్టీ. సునక్ ను ప్రధానిగా చేసింది. అయినా ఫలితం లేదు. దీంతో ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లింది యూకే. అయినా అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురుదెబ్బ తగలింది. దారణమైన ఓటమి ఎదురైంది.