యూకె ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన రిషి సనక్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.కన్జర్వేటివ్ పార్టీ తరపున ఆయన బరిలో ఉన్నారు. సునక్ తోపాటు అనేక మంది భారతీయ సంతతి అభ్యర్థులు కూడా బ్రిటీష్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. 2019లో 15 మంది భారతీయులు బ్రిటీష్ పార్లమెంట్ కు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో పార్లమెంట్ కు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. 2024 యూకె ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలతోపాటు కొత్తవారు కూడా పోటీలో ఉన్నారు. బ్రిటీ ష్ భారతీయులలో అత్యంత ప్రభావం కలిగిఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అలోక్ శర్మ, లేబర్ పార్టీ నాయకుడు వీరేంద్ర శర్మ ఈసారి పోటీ చేయడం లేదు. అయితే కొత్తగా లేబర్ పార్టీ తరపున ప్రఫుల్ నార్గుండ్,సువెల్ల బ్రవేర్మన్,కీత్ వాజ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.
2024 యూకె పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటీస్ ఇండియన్ అభ్యర్థులలో ప్రపుల్ నర్గుండ్ ఇస్లింగ్టన్ నార్త్ నుంచి లేబర్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఐఫోర్ట్ సౌత్ నుంచి జస్ అథ్వాల్, డెర్బీ సౌత్ నుంచి బాగీ శంకర్, సౌతాంప్టన్ టెస్ట్ నుంచి సత్విర్ కౌర్, హడర్స్ ఫీట్డ్ నుంచి హర్ ప్రీత్ ఉప్పల్ పోటీలో ఉన్నారు.
ఇండోర్ లో జన్మించిన రాజేశ్ అగర్వాల్ వ్యాపారిగా లండన్ లో స్థిరపడ్డారు. ఈయన లండన్ మాజీ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఈసారి లీసెస్టర్ ఈస్ట్ నుంచి ఎంపీగా తొలిసారి పోటీ చేస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మరో భారతీయ సంతతి అబ్యర్థి శివాని రాజాతో పోటీ పడుతున్నారు. గోవాకు చెందిన ఎంపీ కీత్ వాజ్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
హెండన్ నుంచి అమీత్ జోగియా, స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ నుంచి చంద్రకన్నెగంటి, హరోవెస్ట్ నుంచి గుజరాతీ ముస్లిం కౌన్సిలర్ అబ్బాస్ మొరాలిని కూడా కన్జర్వేటివ్ తరపును పోటీలో ఉన్నారు. లేబర్ పార్టీ నుంచి వోల్వర్ హాంప్టన్ వెస్ట్ లో వారిందర్ జస్, స్మెత్ విక్ లో గురీందర్ సింగ్ జోసన్, గ్రలామోర్గాన్ వేల్ లో బీహార్ లో జన్మించిన కనిష్క నారాయణ్ లు బరిలో ఉన్నారు. మరోవైపు పీఎం రిషీ సునక్ అనుచరులు ప్రీతి పటేల్, సుయెల్లా బ్రేవర్ మాన్ లు కూడా ఫేర్ హామ్, వాటర్ లూవిల్ లనుంచి పోటీలో ఉన్నారు. వీరంతా 2024 యూకె పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు.