UK.. ఇంగ్లాండ్ పోలింగ్ కు సర్వం సిద్ధం.. అక్కడ ఓటింగ్, కౌంటింగ్ ఎలా జరుగుతుందో తెలుసా..!

UK.. ఇంగ్లాండ్ పోలింగ్ కు సర్వం సిద్ధం.. అక్కడ ఓటింగ్, కౌంటింగ్ ఎలా జరుగుతుందో తెలుసా..!

ఇంగ్లాండ్ దేశంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతున్నది.. 2024 జూలై 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతుంది ఆ దేశం. మొత్తం 650 స్థానాలు ఉండే హౌస్ ఆఫ్ కామన్స్ సభకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతి ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యునైటెడ్ కింగ్ డమ్ పోలింగ్, ఓటింగ్ వివరాలు ఇలా..

  • ఇంగ్లాండ్, నార్త్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాల్లో పోలింగ్ జరగనుంది.
  • మొత్తం 650 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్.
  • 326 సీట్లు మ్యాజిక్ ఫిగర్.. ఈ ఎవరు గెలిస్తే.. ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. 
  • జూలై 4వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
  • గెలిచిన పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉంటుంది.
  • యునైటెడ్ కింగ్ డమ్ లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. 
  • ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. 
  • కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. భారతీయుడు సునక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. 
  • లేబర్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 15 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉంది. ఈ పార్టీ నుంచి కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రచారం చేసింది లేబర్ పార్టీ.
  • ఆ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం..ఓటు వేయటానికి గుర్తింపు కార్డు చూపించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు.
  • ప్రస్తుతం ప్రధానమంత్రి సునక్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాన్ని 2024, మే 30వ తేదీన రద్దు చేశారు. 
  • ఇమ్మిగ్రేషన్ ఉన్న వారికి కూడా ఈసారి ఓటు హక్కు కల్పించారు. 
  • 18 లక్షల మంది భారతీయులు ఈసారి యూకే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోకున్నారు.
  • పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. జూలై 5వ తేదీ తెల్లవారుజాము నుంచే ఎన్నికల ఫలితాలు విడుదల కావటం ప్రారంభం అవుతుంది.
  • జూలై 5వ తేదీ సాయంత్రానికి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. ఏ పార్టీ గెలిచింది అనేది అధికారికంగా ప్రకటిస్తారు.
  • జూలై 9వ తేదీన కొత్త సభ్యులతో పార్లమెంట్ కొలువుదీరుతుంది. 


ప్రస్తుతం అధికారంలో ఉన్న సునక్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ, కీర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ హోరాహోరీగా ప్రచారం ముగించాయి. గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉన్నా.. లేబర్ పార్టీ బలంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Also Read:లండన్‌లో పెరుగుతున్న కరోనా KP3 వేరియంట్ కేసులు .. ఇప్పటికే లక్ష దాటిన బాధితులు