ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో UK లేబర్ పార్టీ నాయకుడు డేవిడ్ లామీ తన ప్రసంగం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాడ్ లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని విమర్శించారు. ఇండియాతో బ్రిటన్ స్వేచ్చా వ్యాపార వాణిజ్యం గురించి బ్రిటన్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకూ చాలా దీపావళి పండగలు వచ్చిపోయాయి అని ఆయన అన్నారు.
భారతదేశంతో బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫెయిల్ అయ్యారని లామీ ఎద్దేవా చేశారు. ప్రతి దీపావళికి ఊహించిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయిని అని ఆశపడుతున్నాం కానీ.. ఎన్నో పండగలు వచ్చి పోతున్నాయ్ తప్పా అది జరగడం లేదని ఆయన అన్నారు. డేవిడ్ లామీ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌లకు సందేశం పంపారు. జూలై 4న జరిగే సాధారణ ఎన్నికలలో తమ లేబర్ పార్టీ గెలిస్తే ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అని తెలిపారు.