మేం ఏ పాపం చేశాం:ట్రంప్ తరహాలోనే.. లండన్లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు, అరెస్టులు

మేం ఏ పాపం చేశాం:ట్రంప్ తరహాలోనే.. లండన్లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు, అరెస్టులు

అక్రమ వలసదారులపై అమెరికా తరహాలోనే బ్రిటన్ కూడా వ్యవహరిస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కైర్ స్టార్మర్ ప్రభుత్వం దేశంలోని అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ తరహా అణిచివేతను ప్రారంభించింది. గల్లీగల్లీ వెతికి పట్టుకొని మరీ అరెస్ట్ చేస్తోంది. రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, స్టోర్లు, కార్ వాష్  వంటి ఇండియన్లు పనిచేస్తున్న దుకాణాలపై పోలీసులు రైడ్స్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, భారతీయులను సంకెళ్లు వేసి బలవంతంగా గెంటేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా యూకె ప్రభుత్వం షేర్ చేసింది.దీంతో లండన్ లో అమెరికా తరహా దాడులతో భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. 

యూకె చెందిన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్సెమెంట్ టీంలు రెస్టారెంట్లు, టేక్‌అవేలు ,కేఫ్‌లతో సహా ఫుడ్స్, డ్రింక్స్, పొగాకు కంపెనీల్లో దాడులు జరిపాయి.. ఈ దాడుల్లో చాలామంది భారతీయులను అరెస్ట్ చేశారు. ఉత్తర ఇంగ్లాండ్‌లోని హంబర్‌సైడ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌ పై దాడి చేసిన ఏడుగురు అరెస్టులు చేసినట్లు, మరో నలుగురు అదుపులోకి తీసుకున్నట్లు స్వయంగా అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read : పారిస్లో విందు.. ప్రధానిమోదీకి వెల్కమ్ డిన్నర్ ఇచ్చిన మాక్రాన్

యూకెలో అక్రమ వలసదారులపై చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ జనవరిలో అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పెరిగాయి..ముఖ్యంగా వలసదారులపై ట్రంప్ నిర్ణయం.. లక్షలాది మందిని అమెరికా నుంచి తరిమేయడం..అందులో వేలాది మంది భారతీయులను సంకెళ్లే వేసి మరీ విమానాల్లో ఇండియా కు పంపించారు. అమెరికాలో వలసదారుల వెలివేత తర్వాత ఇప్పుడు యూకెలో కూడా భారతీయులపై దాడులు పెరిగాయి.  

ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం..సరిహద్దు భద్రతకు భంగం కలిగించే నేర ముఠాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. గతం కంటే ఇప్పుడు దాడులు ఉధృతం చేశాం.. అక్రమంగా వలస కార్మికులచే పనిచేయిస్తున్న యాజమాన్యం పై కూడా జరిమానాలు వేస్తున్నారు.