ఐఫోన్ ఆర్డర్ చేస్తే చాక్లెట్ వచ్చింది

కరోనా వైరస్ కారణంగా  జనాల ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు వ్యవహారాలు అన్నీ మారిపోయాయి. షాపులకు వెళ్లకుండా ఆన్ లైన్లో షాపింగ్ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు బయట షాపులతో పోల్చుకుంటే ఆన్ లైన్లో ఆఫర్ కూడా ఇస్తుండటంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు కొనుగోలు దారులు. ఇందులోభాగంగానే UK చెందిన ఓ వ్యక్తి  యాపిల్ ఫోన్ కొనాలనుకున్నాడు. ఐఫోన్13 కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా పే చేశాడు.  ఇక ఫోన్ వస్తుంది.. దాంతో వీడియోలు, గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చని తెగ మురిసిపోయాడు.

ఫోన్ ఆర్డర్ పెట్టిన అతను ప్యాకేజీ డెలివరీ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. తను అనుకున్నట్టే ఆ ప్యాకేజీ అతనికి అందింది. డెలివరీ బోయ్ ప్యాకేజీ అందించి అతని సంతకం తీసుకుని వెళ్లాడు. తీరా ప్యాకెట్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్య పోయాడు. అందులో యాపిల్ ఫోన్ కు బదులు.. క్యాడ్బరీ చాక్లెట్  ఉంది. దీనికి సంబంధించిన ఆ కంపెనీకి ట్వీట్ పెట్టాడు. తాను ఆర్డర్ చేసిన రెండు వారాలకు ప్యాకేజీ అందిందని.. అయితే డెలివరీ అయిన ఆ బాక్స్ సీల్ తీసి ఉండడమే కాకుండా ఐఫోన్ ప్లేసులో టాయిలెట్ పేపర్ తో చుట్టిన రెండు ఓరియో చాక్లెట్ బార్ లు ఉన్నాయని తెలిపాడు. దీనిపై డెలివరీ కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు.

మరిన్ని వార్తల కోసం...

 

కేసీఆర్ అనాలోచిత, అర్థరాత్రి నిర్ణయాలతోనే ఇబ్బందులు