![అమెరికా బాటలో బ్రిటన్.. అక్రమవలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే వార్త చెప్పిన UK ప్రధాని](https://static.v6velugu.com/uploads/2025/02/uk-prime-minister-keir-starmers-tweet-on-illegal-immigrants_pfUnR3lJBF.jpg)
అమెరికా ఫస్ట్ అన్నదే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నినాదం. అమెరికా ఫలాలను దేశ పౌరులే అనుభవించాలన్నదే ఆయన విధానం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ తన విధానాన్ని స్పష్టంగా వ్యక్తపరిచారు. తాను రెండోసారి అధికారంలోకి వస్తే.. దేశంలో అక్రమంగా నివసిస్తోన్న అక్రమ వలసదారులను మెడలు పట్టుకుని మరీ బయటకు గెంటేస్తానని సూటిగా చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి అమెరికా పగ్గాలు చేపట్టిన ట్రంప్.. వచ్చి రాగానే తన మాట నిలబెట్టుకున్నాడు.
అమెరికాలో నివసిస్తోన్న అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టాడు. అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన దాక్కున్న పట్టుకుని వారిని తిరిగి వాళ్ల సొంత దేశాలకు పంపండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఆదేశాలతో అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం మొదలైంది. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న వారిని గుర్తించి తిరిగి వాళ్ల దేశానికి పంపిస్తున్నారు అధికారులు. మెక్సికో, భారత్ ఇతర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో తిరిగి వాళ్ల సొంత దేశానికి పంపిస్తున్నారు.
ALSO READ | ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడిన : ట్రంప్
ట్రంప్ దూకుడు అమెరికాలో నివసిస్తోన్న అక్రమ వలసదారుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణాని తమ పట్టుకుని బయటకు వెళ్లగొడతారోనని భయంతో బిక్క బిక్కుమంటూ గడుపుతున్నారు. అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతుండగానే.. మరో ప్రముఖ దేశం ఇల్లీగల్ ఇమ్మిగ్రేంట్స్‌పై ఫోకస్ పెట్టింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం (ఫిబ్రవరి 10) అక్రమ వలసదారుల వెన్నులో వణుకు పుట్టే ట్వీట్ చేశారు.
‘‘యూకేకు అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది యూకేలో అక్రమంగా పని చేస్తున్నారు. దేశంలో పెరిగిపోయిన అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతాం’’ అని యూకే కీర్ స్టార్మర్ చేసిన ట్వీట్ ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారి తీసింది. కీర్ స్టార్మర్ ట్వీట్‌తో అక్రమ వలసదారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో నడవబోతున్నట్లు తేటతెల్లమైంది. యూకే త్వరలోనే దేశంలో ఉన్న ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ను గుర్తించి తిరిగి వారి సొంత దేశానికి పంపేందుకు రెడీ అయినట్లు అర్థమవుతోంది.
దీంతో యూకేలో అక్రమంగా నివసిస్తోన్న వారి వెన్నులో వణుకు మొదలైంది. లక్షలు ఖర్చు చేసి ఇక్కడకి వస్తే.. ఇప్పుడు తిరిగి పంపితే తమ భవిష్యత్ ఏంటని బ్రిటన్‌లో అక్రమంగా నివసిస్తోన్న వారిలో భయం స్టార్ట్ అయ్యింది. బ్రిటన్‌లో చదువు, ఉద్యోగాల కోసం భారతీయులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తారు. ప్రస్తుతం లక్షల సంఖ్యలో ఇండియన్స్ యూకేలో ఉన్నారు. వీరిలో చాలా మంది వీసా గడువు ముగియడం, ఇతరత్రా కారణాలతో అక్కడే అక్రమంగా ఉంటున్నారు. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం అక్రమ వలసదారులను తిరిగి పంపించాలని నిర్ణయం తీసుకోవడంతో వారిలో టెన్షన్ మొదలైంది.