యూకే వీసాకు కొత్త రూల్స్.. ఇండియన్స్ కు కష్టమే.!

వీసా మంజూరులో  యూకే ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఫ్యామిలీ వీసా రూల్స్ ను  మరింత కఠినతరం చేసింది. యూకేలో ఉంటున్న వారు వారి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే..కనీస వార్షిక వేత పరిమితిని పెంచినట్లు ప్రకటించింది.  ఫ్యామిలీ  వీసాకు   కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. ఏప్రిల్ 11  నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

ఫ్యామిలీ వీసా స్పాన్సర్ కు  వార్షిక వేతనం  గతంలో 18 వేల 600 పౌండ్స్ ఉండగా..దానిని ప్రస్తుతం 29 వేల పౌండ్స్ కు పెంచింది యూకే సర్కార్ .   అంతేగాకుండా  2025 జనవరి నుంచి 38 వేల700 పౌండ్స్ కు పెంచనున్నట్లు తెలిపింది. 

 దేశంలో వలసలు పెరుగుతున్న క్రమంలో రిషీ సునక్  సర్కార్  వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ 2023లో డిసెంబర్ బిల్లు ప్రవేశ పెట్టింది.ఫ్యామిలీ వార్షిక వేతనం 38 వేల 700 పౌండ్లకు పెంచాలని నిర్ణయించారు.అయితే పెద్ద ఎత్తును విమర్శలు రావడంతో రెండు విడుతలుగా పెంచాలని నిర్ణయించింది. అందుకే ప్రస్తుతం 29 వేల పౌండ్లకు వచ్చే ఏడాదిలో 38 వేల 700 పౌండ్లకు పెంచుతామని ప్రకటించింది. యూకే కొత్త నిబంధనలతో  ఇండియన్స్ మీద ఎక్కువ ప్రభావం  పడే అవకాశం ఉంది.