బ్రిటన్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. బ్రిటన్ లో ఒకేసారి పదివేల ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం ఒక్కరోజు
10059 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య24968కు చేరింది. ఒమిక్రాన్ మరణాల సంఖ్య కూడా 7కి పెరిగింది. అయితే కొత్త వేరియంట్ కేసులు శుక్రవారం 3,201 నమోదు కాగా.. ఒక్క రోజులోనే 3 రెట్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం 125 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ లో 23168, నార్తెన్ ఐర్లాండ్ లో 827, స్కాట్లాండ్ లో 792 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఇంగ్లండ్ ఆస్పత్రుల్లో కూడా ఒమిక్రాన్ తో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
బ్రిటన్‌లో ఇప్పటికే నిర్దిష్ట కార్యక్రమాలకు కొవిడ్ పాసులు, అనేకచోట్ల మాస్కులు తప్పనిసరి చేయడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహిస్తున్నారు. ఈనెల 27 నుంచి వేల్స్‌లో నైట్‌క్లబ్‌లను మూసివేస్తున్నారు. మరోవైపు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. బ్రిటన్‌లో 40 ఏళ్లు దాటినవారిలో మూడొంతుల మందికి బూస్టర్ డోస్ అందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులకు అడ్డుకట్ట వేయాలంటే.. క్రిస్మస్ కు ముందు లాక్ డౌన్ వేయాలని కొందరు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ తర్వాత బ్రిటన్ లో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: