యూకేలో షాపులపై విరుచుకుపడ్డ తీవ్రవాదులు .. ప్రధాని కైర్ స్టార్మర్ స్ట్రాంగ్ వార్నింగ్ ..

యూకేలో షాపులపై విరుచుకుపడ్డ తీవ్రవాదులు .. ప్రధాని కైర్ స్టార్మర్ స్ట్రాంగ్ వార్నింగ్ ..

యూకేలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. షాపులను దోచుకున్న టెర్రరిస్టులు వాటిని దగ్ధం చేశారు. చర్మం రంగు ఆధారంగా దేశ ప్రజలపై దాడికి పాల్పడుతున్న టెర్రరిస్టులకు ప్రధాని కైర్ స్టార్మర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు యువతుల హత్యపై వచ్చిన తప్పుడు కథనాలతో చెలరేగిన ఈ అల్లర్లు దశాబ్దంలోనే తీవ్రమైనవని అంటున్నారు. యాంటీ ఇమ్మిగ్రేషన్ నిరసనల సమయంలో బెల్ ఫాస్ట్ లోని ఓ కేఫ్ ను తగలబెట్టారు తీవ్రవాదులు.

ఈ క్రమంలో ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ఈ దాడులకు పాల్పడ్డ ఫార్ రైట్ తగ్స్  వారి చర్యలకు తప్పకుండా పశ్చాత్తాపపడతారని, చట్టరీత్య ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఈ తీవ్రవాద గుంపు మన దేశానికి ప్రాతినిధ్యం వహించదని, మేము వారిని కోర్టు మెట్లు ఎక్కిస్తామని అన్నారు. జాతి, మతం ఆధారంగా జరుగుతున్న దాడుల బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రధాని కైర్ స్టార్మర్.