చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!

లక్ష్మీదేవి కరుణించినా.. దురదృష్టం అడ్డుపడినట్లు ఉంది ఇతని పరిస్థితి. రూ.5 వేల 900 కోట్లు చెత్తలో పోయాయి. ప్రస్తుతం హాల్ఫినా ఎడ్డీ- ఇవాన్స్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జేమ్స్ హోవెల్స్. 2009లో హోవెల్స్ 8వేల బిట్ కాయిన్స్ కొన్నాడు. ప్రస్తుతం వాటి విలువ అక్షరాల 5వేల 900 కోట్లు. ఇది డబ్బు చేజేతా పొగొట్టుకుంటే బాధ ఉంటది కాదా.. హోవెల్స్ కొన్న క్రిప్టోకరెన్సీ డిజిటల్ కీ ఉన్న హార్డ్ డ్రైవ్ కొన్నాళ్ల తర్వాత చెత్తలో పోయింది. హాల్ఫినా ఎడ్డీ- ఇవాన్స్, హోవెల్స్ కలిసి ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేస్తుండగా హల్ఫినా ఆ హార్డ్ డిస్క్ ను చెత్తలో వేసింది. ఆ హార్డ్ డిస్క్ లో క్రిప్టో డిజిటల్ కీ ఉందని ఆమెకు తెలియదు. మున్సిపాలిటీ వారు వచ్చి ఆ చెత్తను సేకరించుకెళ్లారు. అమెరికాలోని న్యూపోర్ట్‌లోని ల్యాండ్‌ఫిల్‌ డపింగ్ ఏరియాకు ఆ బిట్ క్యాయిన్స్ డిజిటల్ కీ ఉన్న హార్డ్ డిస్క్ తరలించారు. 

ALSO READ | అవన్నీ ఫేక్.. యూఎస్ కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్

గతంలో అతంత మాత్రంగా ఉన్న క్రిప్టో కరెస్సీ వాల్యూ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. క్రిప్టో కరెన్సీ విలువ పెరుగడం ప్రారంభమైనప్పటి నుంచి హోవెల్స్ ఆ డంపింగ్ యార్డ్ తవ్వకాలు జరపాలని కౌన్సిల్ ను కోరుతూ వచ్చాడు. అయినా కౌన్సిల్ అందుకు అనుమతించడం లేదు. ఇప్పుడు న్యూపోర్ట్ ల్యాండ్‌ఫిల్‌లో 100,000 టన్నుల వ్యర్థాలను పాతిపెట్టారు. వాటి కిందనే రూ.5,900 కోట్లు ఉన్నాయి. హోవెల్స్ హార్డ్ డిస్క్ కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నాడు. హోవెల్స్ న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్‌పై  దావా వేశాడు. హాల్ఫినా ఎడ్డీ అందులో క్రిప్టో కరెన్సీ డిజిటల్ కీ ఉందని ఆమెకు తెలియక చెత్తలో విసిరానని చెప్పింది. దేవుడి దయ వల్ల అది దొరికితే చాలని.. అందులో ఆమెకు వాటా ఏం వద్దని అంటోంది. బిట్ కాయిన్ విలువ రోజు రోజుకు పెరిగిపోతుంది.. దీంతో హోవెల్స్ ఆశలు పెంచుకుంటున్నాడు.