ఉక్రెయిన్లో చిక్కుకున్న సిటీ స్టూడెంట్ కల్పన వీడియో
జీడిమెట్ల, వెలుగు: షాపూర్నగర్కి చెందిన కల్పన ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతుండగా ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ సోమవారం పేరెంట్స్కు వీడియో పంపింది. కర్ఫ్యూలో చదువుకుంటున్నానని, బంకర్లో తలదాచుకున్నామని తెలిపింది. తెలుగువారు సుమారు 500 మంది ఉంటారని, బార్డర్స్లో ఉన్నవారిని మాత్రమే అధికారులు ఇండియా తీసుకెళ్తున్నారని ఆమె ఏడుస్తూ చెప్పింది. 4 రోజులుగా బంకర్లో ఉన్నామని బయటకు వెళ్లే మార్గం లేదని వాపోయింది. మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు.
మరో 11 మంది వచ్చిన్రు
శంషాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుపోయిన మరో 11 మంది తెలుగు విద్యార్థులు సోమవారం సిటీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ఎయిర్పోర్టుకు వచ్చిన వాళ్లను చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.