ఉక్రెయిన్ దళాల చేతిలో రష్యాకు ఎదురుదెబ్బ

కీవ్: ఉక్రెయిన్ దేశంలోని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. మరో కీలక కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉక్రెయిన్ దళాల ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ప్రపంచ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు, సాంకేతిక సహకారంతో రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ దళాలు అదను చూసి దెబ్బకొట్టడుతున్నాయి.

తాజాగా 49వ కంబైన్డ్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ ఉక్రెయిన్ దళాల ఎదురుకాల్పుల్లో చనిపోయారు. రష్యా కమ్యునికేషన్ వ్యవస్థల్లోకి చొరబడి లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ కదలికలను గుర్తించిన ఉక్రెయిన్ హఠాత్తుగా చేసిన దాడి చేసింది. ఈ దాడిలో జనరల్ యాకోవ్ తోపాటు 150 మందికిపైగా రష్యా సైనికులు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. 

 

ఇవి కూడా చదవండి

విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు

సోమ, మంగళవారాల్లో భారత్ బంద్

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్