రష్యాలో కార్యకలాపాలు నిలిపేసిన ఐబీఎం

రష్యాలో కార్యకలాపాలు నిలిపేసిన ఐబీఎం

రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఐబీఎం ప్రకటించింది.రష్యా, బెలారస్ లపై మూడో దఫా ఆంక్షల వివరాలను జపాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రష్యాకు చెందిన 20 మంది, రెండు సంస్థలు, బెలారస్ కు చెందిన 12 మంది, 12 సంస్థలపై నిషేధం విధించారు. రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ కు బ్రిటన్ ఆర్థిక సాయం ప్రకటించింది. మనవతా దృక్పధంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఇటు ప్రపంచ బ్యాంక్ కూడా 723  మిలియన్ డాలర్ల రుణాలు ఉక్రెయిన్ కు అందించింది. 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన తమిళనాడు యువకుడు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

బెలూన్స్​తో మోడలింగ్​ ఛాన్స్