కీవ్: ఉక్రెయిన్ దేశంపై భీకర దాడులు ప్రారంభించిన రష్యా ఇవాళ 19వ రోజు నాటికి మృతుల సంఖ్య 2500కు చేరిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా వెల్లడించారు. యుద్ధ నీతిని పాటించకుండా నివాస భవనాలపై కూడా బాంబు దాడులు, క్షిపణుల దాడులతో విరుచుకుపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మేరియుపోల్ నగరం స్మశాన వాతావరణం ఏర్పడిందంటూ ఆయన ఒక ఫోటోను ట్వీట్ చేశారు. ఈ నగరంలో రష్యా జరిపిన దాడులతో ఎక్కడ చూసినా శవాల గుట్టలతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఈ నగరంలో ఇప్పటి వరకు దాదాపు 2500 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఒలెకసీ అరెస్టోవిచ్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ లో మరణాల సంఖ్య 1500కు చేరిందని విదేశాంగ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరణాల సంఖ్య 2500కు చేరిందని స్వయంగా అధ్యక్ష సలహాదారు ప్రకటించారు.
ఉక్రెయిన్ సైనిక దళాలతోపాటు పౌరులు కూడా ఎక్కడికక్కడ తిరగబడుతుండడంతో రష్యా సైనికులు అసహనంతో మానవత్వాన్ని మరచి దాడులు చేస్తోందని.. నివాస భవనాలపై కూడా దాడులు జరుపుతున్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికారులు ఆరోపించారు. కొరకరాని కొయ్యగా మారిన ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించుకునేందుకు దాడులను మరింత ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటోనోవ్ ఏవియేషన్ ఇండస్ట్రీ పార్కు తగలబడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్
బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర కామెంట్స్