ఉక్రెయిన్ మంత్రి కులేబా రాజీనామా

ఉక్రెయిన్ మంత్రి కులేబా రాజీనామా

కీవ్: ఉక్రెయిన్ ఫారెన్ మినిస్టర్ దిమిత్రో కులేబా తన పదవికి రిజైన్ చేశారు. తన రాజీనామాకు గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు. మంగళవారం రాత్రి లవీవ్​పై రష్యా దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు మరణించడం, మరో 52 మంది గాయపడటంతో కులేబా బుధవారం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దీనిపై తదుపరి పార్లమెంటరీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్‌‌‌‌చుక్ చెప్పారు. కాగా, ఉక్రెయిన్, రష్యా యుద్ధం 1,000 రోజులకు చేరనుంది.