- కజాన్ సిటీలో రెండు భారీ భవనాలపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ 9/11 తరహాలో దాడులు చేసింది. కజాన్ సిటీలో రెండు భారీ బిల్డింగులపైకి డ్రోన్లను ప్రయోగించింది. శనివారం ఉదయం 7.40 గంటల నుంచి 9.20 గంటల మధ్య మూడు దశల్లో దాడి చేసింది. మాస్కోకు 800 కిలోమీటర్ల దూరంలోని కజాన్ సిటీ వైపు ఉక్రెయిన్ నుంచి డ్రోన్లు దూసుకువచ్చాయి. కొన్ని డ్రోన్లు రెండు రెసిడెన్షియల్ బిల్డింగులపై అటాక్ చేయగా.. మిగతా డ్రోన్లను రష్యా సైనికులు కూల్చివేశారు.
కజాన్లో రష్యా ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్స్ మోహరించినప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే, ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో బిల్డింగులు డ్యామేజ్ అయ్యాయని, అయితే, ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. బిల్డింగుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించామని చెప్పారు. కజాన్ సిటీలోని ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశామని తెలిపారు.