
దేశం కోసం యుద్దం చేయాలనుకునే అందరికీ ఆయుధాలను ఇస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుతో ఆ దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. వేలాది మంది ఆయుధాలను చేతపట్టి స్వచ్ఛందంగా యుద్ధ రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తోంది. సైనిక నేపథ్యం ఉన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులుగా ఉన్న వారిని విడుదల చేస్తోంది. వీరంతా ఉక్రెయిన్ తరపున రష్యాపై యుద్ధం చేయనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..