కీవ్: రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్దం మొదలై రెండు నెలలు కావొస్తోంది. బాంబులు, మిసైల్ దాడులతో ఉక్రెయిన్ దేశాన్ని రష్యా బలగాలు సర్వ నాశనం చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా చూసిన భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఎంత వారించినా వినకుండా పుతిన్ సైన్యం యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఉక్రెయిన్ సోల్జర్స్ ఏమాత్రం భయపడకుండా రష్యన్ బలగాలతో వీరోచితంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన కాల్పుల్లో ఓ ఉక్రెయిన్ సైనికుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడిని ప్రాణాల నుంచి కాపాడింది మాత్రం అతడి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్.
A smartphone saved #Ukrainian soldier's life pic.twitter.com/FstoqrTJov
— Giorgi Revishvili (@revishvilig) April 19, 2022
రష్యన్–ఉక్రెయిన్ సైనికుల మధ్య వీరోచితంగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ రష్యన్ సోల్జర్ గన్ నుంచి 7.22 ఎమ్ఎమ్ బుల్లెటొకటి ఉక్రెయిన్ సైనికుడి వైపు శరవేగంగా దూసుకొచ్చింది. అయితే ఆ బుల్లెట్ ఉక్రెయిన్ సోల్జర్ ప్యాంట్ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ కు తగిలింది. దీంతో ఆ సోల్జర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. లేకుంటే ఆ సైనికుడి శరీరాన్ని చీల్చుకంటూ బుల్లెట్ బయటికి దూసుకెళ్లేది. ఈ విషయాన్ని ప్రమాదం నుంచి బయటపడ్డ సోల్జర్ తన సహచరుడితో చెబుతున్న వీడీయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
How a smartphone saved a soldier's life in Ukraine
— ANI Digital (@ani_digital) April 20, 2022
Read @ANI Story | https://t.co/kEFoz7EL50#RussiaUkraineWar #Ukraine️ #UkraineRussiaWar pic.twitter.com/M6BIxYdE5i
మరిన్ని వార్తల కోసం...