రష్యా ​ఆర్మీ కాన్వాయ్ ముందుకెళ్తలే!

రష్యా ​ఆర్మీ కాన్వాయ్ ముందుకెళ్తలే!

వాషింగ్టన్: ఉక్రెయిన్​రాజధాని కీవ్ వైపు సాగుతున్న 64 కిలోమీటర్ల రష్యన్ మిలిటరీ కాన్వాయ్ ​గడిచిన 24 గంటల్లో కొద్ది దూరమే ముందుకు కదిలిందని యూకే, యూఎస్ ఇంటెలిజెన్స్​వర్గాలు అంచనా వేశాయి. ‘‘రష్యన్ బలగాలు దక్షిణాన ఖేర్సన్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. గత 24 గంటల్లో ఉత్తరాన మాత్రం అనుకున్నంతగా ముందుకు కదలలేదు. బహుశా మిలిటరీ దళాల లాజిస్టికల్ ఇబ్బందులు, ఉక్రేనియన్ తీవ్ర ప్రతిఘటన వల్ల వారు వేగంగా ముందుకెళ్లకపోవచ్చు” అని యూకే రక్షణ శాఖ తెలిపింది. యూకే రక్షణ శాఖ అంచనాతో యూఎస్ ఇంటెలిజెన్స్​అధికారులూ ఏకీభవిస్తున్నారు. ‘‘వారు ఎన్ని మైళ్లు ముందుకు వెళ్తున్నరనే దానిపై నేను గంట గంటకు ఖచ్చితమైన అంచనా చెప్పలేను. రష్యన్​మిలిటరీ కాన్వాయ్​అంత వేగంగా ముందుకు వెళ్లడంలేదని మాత్రం చెప్పగలం’’ అని యూఎస్​కు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్​క్యాపిటల్​కీవ్​ను స్వాధీనం చేసుకోవడానికి ఇది ప్రిపరేషన్​అని, దాని ఫలితం బయటపడేందుకు కొన్ని వారాలు పట్టొచ్చని ఇండియాకు చెందిన మిలిటరీ ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ‘‘1941లో కీవ్​ను ముట్టడించేందుకు సరిగ్గా ఒక నెల రోజుల టైమ్​పట్టింది. అప్పట్లో దాదాపు 5 లక్షల మంది తీవ్ర గాయాలపాలయ్యారు”అని రిటైర్డ్​ఎయిర్ ​వైస్​మార్షల్​ సుబ్రమణియన్​తెలిపారు. శాటిలైట్​చిత్రాలను చూస్తే 900 వెహికిల్స్, 3 సాయుధ బలగాల డివిజన్లు సహా పెద్ద ఎత్తున మిలిటరీ దళాలు కీవ్​వైపు సాగుతున్నట్లు కనిపిస్తోందని రిటైర్డ్​లెఫ్టినెంట్​జనరల్​సయ్యద్​అటా హస్నేయిన్​అంచనా వేశారు.

For more News

ధరణితో దారుణాలు

శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర చేసిన్రు