చర్చలకు ముందు బాంబు దాడుల్ని నిలిపేయండి

చర్చలకు ముందు బాంబు దాడుల్ని ఆపేయాలన్నారు  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఇవాళ( బుధవారం) రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా  మాట్లాడిన  జెలెన్స్కీ .. రష్యా వైమానిక దళాన్ని నిలువరించేందుకు నో ఫ్లై జోన్‌ విధించాలని నాటో సభ్యుల్ని కోరారు.  ఈ ఆంక్షలు విధించడంతో.. నాటో దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నాయన్న  అర్థం కాదని, అది కేవలం నివారణ చర్య అని అన్నారు. వాస్తవానికి రష్యా కారణంగానే ప్రతి ఒక్కరు ఈ యుద్ధంలోకి రావాల్సి వచ్చిందని అన్నారు.  అలాగే ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకునే అవకాశం లేకపోతే.. తమ దేశానికి చట్టపరమైన భద్రతకు హామీ ఉండాలని అన్నారు. వాటి ద్వారా తమ దేశ సరిహద్దులకు రక్షణ ఉంటుందని, తమ దేశ సమగ్రతకు రక్షణ లభిస్తుందని, పొరుగు దేశాలతో ప్రత్యేక సంబంధాలుంటాయని తాము అర్థం చేసుకుంటామని అన్నారు. అలాగే రష్యా సైనిక చర్యపై జెలెన్‌స్కీ ఐరోపా దేశాలను హెచ్చరించారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ పతనమైతే.. రష్యా దళాలన్నీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని అన్నారు. అప్పుడు మీకూ అదే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. దాడులకు ముందే రష్యాపై ఆంక్షలు విధించాలన్న తన అభ్యర్థనను అమెరికా, ఐరోపా దేశాలు విస్మరించాయన్నారు. ఇప్పటికైనా రష్యాకు ఆంక్షల రూపంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి మొదలైందని .. వీటిని స్వాగతిస్తామని జెలెన్‌స్కీ అన్నారు.

 మరిన్ని వార్తల కోసం..

పాక్ విద్యార్థులను కాపాడిన భారత జెండా