ఉక్రెనియన్ దాడిలో ఆరుగురు మృతి.. ముగ్గురు జర్నలిస్టులే: రష్యా

ఉక్రెనియన్ దాడిలో ఆరుగురు మృతి.. ముగ్గురు జర్నలిస్టులే: రష్యా

మాస్కో: తమ ఆధీనంలో ఉన్న లుహాన్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ సోమవారం ఆర్టిలరీ(ఫిరంగి) దాడికి పాల్పడిందని రష్యా తెలిపింది. ఈ ఘటనలో ముగ్గురు జర్నలిస్టులు సహా ఆరుగురు మరణించారని వెల్లడించింది. మృతుల్లో రష్యాకు చెందిన ఇజ్వెస్టియా మీడియా జర్నలిస్ట్ అలెగ్జాండర్ ఫెడోర్‌‌చాక్, రష్యా రక్షణ శాఖ నిర్వహిస్తున్న టెలివిజన్ ఛానల్ జ్వెజ్డాకు కెమెరా ఆపరేటర్ అండ్ డ్రైవర్ అయిన ఆండ్రీ పనోవ్, అలెగ్జాండర్ సిర్కెలి ఉన్నారని వివరించింది. 

చనిపోయినవారిలో 14 ఏండ్ల బాలుడు కూడా ఉన్నాడని లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా నియమించిన గవర్నర్ లియోనిడ్ పసెచ్నిక్ వివరించారు.