
ఓ వైపు యుద్దం..మరోవైపు శాంతిచర్చలు.. అందరి దృష్టి ట్రంప్, జెలెన్ స్కీ సమావేశంపైనే.. యుద్ధంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారోనని..అయినా ఇవన్నీ వదిలిపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ‘‘నువ్వు సూట్ ఎందుకు ధరించలేదని’’ అడిగాడు. సమాధానం దాటవేసిన జెలెన్ స్కీ.. దేశం కోసం..శాంతికోసం జరగాల్సిన చర్చలపైనే దృష్టి పెట్టాడు. ఇదంతా ఇటీవల అమెరికా వైట్ హౌజ్ లో రష్యా, ఉక్రెయిన్ వార్ శాంతి చర్చల సందర్భంగా జరిగిన సంఘటన. అందరికి ట్రంప్ కు వచ్చిన డౌటే వచ్చింది.. జెలెన్ స్కీ ఎందుకు సూటు వేసుకోడు? అని..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ..కనిపించిన ప్రతీసారీ నలుపుగా కనిపించే థిక్ గ్రీన్ టీషర్ట్ వంటి దుస్తులతో కనిపిస్తాడు.. ఇది రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటినుంచి.. అది అధికారిక సమావేశమైనా.. మీడియా సమావేశమైనా.. ఇంకేదైనా..జెలెన్ స్కీ ఎందుకు సూటు వేసుకోడు.. ? ఈ ప్రశ్నలకు ఓ జర్నలిస్టు సమాధానం చెప్పింది. జెలెన్ స్కీతో చేసిన ఓ ఇంటర్వ్యూలో ఆ రహస్యాన్ని చెప్పాడని అంటోంది.
ALSO READ | ఆ నలుగురిలో కెనడా కొత్త ప్రధాని ఎవరు?
జెలెన్ స్కీ సూటు ధరించకపోవడం వెనక ఓ సీక్రెట్ ఉంది. జెలెన్ స్కీ ధరించిన దుస్తులు అమెరికన్లు సాధారణ దుస్తులుగా చూసినప్పటికీ అవి సాధారణమైన కావని ఉక్రెయిన్ జర్నిలిస్ట్ ఇలియా పోనోమారెంకో అన్నారు. అలీవ్ గ్రీన్ దుస్తులు.. పోరాటానికి చిహ్నం. యుద్దం భూమిలో ప్రజల సంస్కృతికి ఇది నిదర్శనం అన్నారు.
అంతేకాదు.. జెలెన్ స్కీ ధరించిన దుస్తులు.. ఉన్నత వర్గానికి వ్యతిరేక సందేశాన్ని పంపుతాయి.. అధికారిక సమావేశం అయినా..ప్రముఖులను కలిసినా.. ఇవే దుస్తులు ధరిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. రాజులను కలిసినా యుద్దభూమిలో సగటు ఉక్రేనియన్ ను సూచించే ఈ దుస్తులనే ధరిస్తాడు. అని పోనోమారెంకో అన్నారు.
ఇంకా జెలెన్ స్కీ దుస్తుల గురించి చెబుతూ.. ఆయన ఎక్కువగా ఉక్రేనియన్ బ్రాండ్లను వినియోగిస్తారు. ఇవి చాలా సాధారణమైనవి. ఈ దుస్తులు యుద్ధభూమిలో ధరించేవి.. బాడీ ఆర్మర్, మిలిటరీ కంబాట్ జాకెట్ తో ధరించే దుస్తులు అని పోనోమారెంకో చెప్పారు.
జెలెన్ స్కీ దుస్తులను డిజైన్ చేసిన డిజైనర్ ఎల్విరా గసనోవా కూడా ఆసక్తి కర విషయాలు చెప్పారు. జెలెన్ స్కీ ధరించే దుస్తులపై అతి ముఖ్యమైనది ఉక్రేనియన్ త్రిశూలం.ఇది జాతీయ చిహ్నంలో ఒకటి. సూటు అవసరం లేని యుద్ధ నాయకుడు జెలెన్ స్కీ.. త్రిశూలం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పారు.
కొసమెరుపు ఏంటంటే.. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి జెలెన్ స్కీ తన ఆలివ్ ,నలుపు టీ-షర్టులు, కార్గో ప్యాంటుతో ధరించే స్వెట్‌షర్టులు తప్పా మరే దుస్తులు ధరించకపోవడం అతని దేశభక్తి, నాయకుడిగా ప్రజల పట్ల బాధ్యతను గుర్తు చేస్తున్నాయడంలో సందేహం లేదు.