రష్యన్ హెలికాప్టర్లను కూల్చేసిన ఉక్రెయిన్ నావల్ డ్రోన్

రష్యన్ హెలికాప్టర్లను కూల్చేసిన ఉక్రెయిన్ నావల్ డ్రోన్
  • ఎయిర్ టార్గెట్​ను ఛేదించడం ఫస్ట్ టైమ్ అని వెల్లడి

ఉక్రెయిన్: రష్యా హెలికాప్టర్​ను ఉక్రెయిన్ నావల్ డ్రోన్ మిసైల్ కూల్చేసింది. నల్ల సముద్రంలో నావల్ డ్రోన్ల సాయంతో రష్యాపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ఇంటలిజెన్స్ ప్రకటించింది. ఈ మేరకు రష్యాకు చెందిన ఎంఐ–8 హెలికాప్టర్​ను ‘మగురా వీ5 నావల్ డ్రోన్’ కూల్చేస్తున్న వీడియోను ట్విటర్​లో పోస్టు చేసింది. నల్ల సముద్రంలో నావల్ డ్రోన్ కదలికలను గుర్తించిన రష్యన్ ఎంఐ 8 హెలికాప్టర్.. దానిపై కాల్పులు జరిపింది. నీళ్లలో బుల్లెట్లు దూసుకెళ్లడం కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. కాల్పులతో అలర్ట్ అయిన మగురా వీ5 నావల్ డ్రోన్.. వెంటనే కంట్రోల్ సెంటర్​కు సమాచారం చేరవేసింది.

ఆ తర్వాత, థర్మల్ ఇమేజ్ సాయంతో నావల్ డ్రోన్​పై అమర్చిన మిసైల్.. హెలికాప్టర్​ను క్యాప్చర్ చేసి గురిపెట్టింది. క్షిపణి దూసుకెళ్లి హెలికాప్టర్​ను తాకడంతో క్షణాల వ్యవధిలోనే అది నల్ల సముద్రంలో కూలిపోయింది. మరో హెలికాప్టర్​ను కూడా నావల్ డ్రోన్ డ్యామేజ్ చేసింది. ‘‘నా హెలికాప్టర్​పై ఉక్రెయిన్ నావల్ డ్రోన్ మిసైల్ దాడి చేసింది.. హెలికాప్టర్ కూలిపోతున్నది’’అని పైలెట్ చెప్పడం ఇంటర్ సెప్టెడ్ రేడియో కమ్యూనికేషన్స్ లో రికార్డ్ అయింది. ఎయిర్ టార్గెట్​ను నావల్ డ్రోన్ల సాయంతో కూల్చడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఉక్రెయిన్​కు చెందిన మిలటరీ ఇంటలిజెన్స్ సర్వీస్ తెలిపింది.