యూరప్ కూటమి కడదాం..ఇదే తగిన సమయం: జెలెన్ స్కీ

యూరప్ కూటమి కడదాం..ఇదే తగిన సమయం: జెలెన్ స్కీ

మ్యూనిచ్: యూరోపియన్  యూనియన్  దేశాలు సైనిక కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు  సమయం వచ్చిందని ఉక్రెయిన్  అధ్యక్షుడు వోలోదిమిర్  జెలెన్ స్కీ అన్నారు. శనివారం జర్మనీలో మ్యూనిచ్  సెక్యూరిటీ కాన్ఫరెన్స్  రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రష్యా దురాక్రమణపై గత మూడేండ్లుగా యుద్ధం చేస్తున్నామని, ఈ నేపథ్యంలో శక్తివంతమైన యూరోపియన్  సైనిక కూటమి ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఈ ఐడియాకు యూరోపియన్  లీడర్లు ఒప్పుకుంటారో లేదో తెలియదన్నారు. ఈయూ నుంచి తమకు మరింత మిలిటరీ సపోర్టు, ఆర్థిక సహాయం కావాలన్నారు.