
- రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదన
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రతిపాదన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడితో శాంతి చర్చలు స్టార్ట్ చేద్దామని ప్రపోజల్ పెట్టాడు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై మూడేండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కీవ్‌లో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ..యుద్ధ ఖైదీల మార్పిడికి తాము రెడీగా ఉన్నామన్నారు.
రష్యా అధికారులు ఉక్రేనియన్లను విడుదల చేస్తే.. బదులుగా తాము రష్యా ఖైదీలను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాం. ఇదే శాంతిని ప్రారంభించడానికి సరైన మార్గం" అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మూడేండ్లుగా రష్యా వంటి శక్తివంతమైన దేశంతో పోరాడి ఐక్యతను ప్రదర్శించినందుకు తన దేశ ప్రజలను, దేశ సైన్యాన్ని ఆయన ప్రశంసించారు.
యుద్ధంలో తమకు మద్దతు ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్యవర్తిత్వంతో 2024 అక్టోబర్‌లో 95 మంది ఖైదీల మార్పిడి జరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో 103 మంది ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి.