కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొద్దిసేపటి ఒక వీడియో విడుదల చేశారు. తాను దేశం విడిచి వెళ్లినట్లు.. పారిపోయినట్లు.. తాను చనిపోతే ప్రత్యామ్నాయాలు ఏర్పాట్లు చేసినట్లు.. రకరకాల వార్తలు వస్తుండడం గమనించి నిజాలు ప్రపంచానికి తెలియజేసేందుకు వీడియో విడుదల చేశారు. సోమవారం రాత్రి సమయంలో ఈ వీడియోను తీసినట్లు కనిపిస్తోంది. తాను కీవ్ నగరంలోని తన కార్యాలయంలోనే సురక్షితంగా ఉన్నానని జెలెన్ స్కీ సెల్ఫీ వీడియోతో నగర వీధులను అద్దాల్లో నుంచి చూపుతూ.. తన కార్యాలయంలోని సీట్లో ఆసీనమై మాట్లాడే వీడియోను పోస్టు చేశారు. పాతది అనుకునే అవకాశం లేకుండా.. కొన్ని గంటల క్రితం జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ మట్లాడారు.
‘ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలుపెట్టి 12 రోజులు అవుతోంది.. గత 12 రోజులుగా ఉక్రెయిన్ సైన్యం.. ప్రజలు చేస్తున్న పోరాటం అభినందనీయం.. నేనెవరికీ భయపడడం లేదు.. ఉక్రెయిన్ సైన్యం, ప్రజలు, డాక్టర్లు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ రష్యా దళాలు సంఘటితంగా తిప్పికొడుతున్నారు.. రష్యా దళాలను ప్రజలు ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తున్నారు.. రష్యా సైనికులను సామాన్యులు కూడా నిలదీసి ప్రతిఘటిస్తున్న తీరు అమోఘం.. ఉక్రెయిన్ తన స్వేచ్ఛ స్వాతంత్రాలను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. రష్యా బాంబు దాడుల్లో ధ్వంసమైన ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలను పునర్ నిర్మించుకంటాం.. పోరాటం కొనసాగిస్తాం.. తగ్గేదే లేదు..’ అంటూ జెలెన్ స్కీ వీడియోలో వివరించారు.
ఇవి కూడా చదవండి
ఆమె ఆరోగ్యానికి ఆఖరి ప్రయారిటీ ఎందుకు ?