రష్యా సైనికులను నిలదీసిన మహిళ

ఉక్రెయిన్​లోని హెనిచెస్క్​ సిటీలో రష్యా సైనికులను నిలదీసిందో మహిళ.. మా గడ్డపై మీకేంపనంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. తుపాకులు, మెషిన్​గన్లతో నిలుచున్న రష్యా సైనికులను చూసి ఏమాత్రం భయపడలేదు. ఇక్కడ ఏం జరగట్లేదని వాళ్లు ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించారు. ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండని చెప్పినా ఆమె లెక్కచేయలేదు. ఈ భూమిపై మీకేం దొరకదంటూ.. జేబులో పెట్టుకోండని పొద్దుతిరుగుడు గింజలు ఇచ్చింది. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు ఆ పువ్వులయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి వెళ్లిపోయింది.