యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కి జంటగా ‘దేవర’(Devara) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్(Janhvi Kapoor). కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో 'తంగం' పాత్రలో నటించి మెప్పించిందనే టాక్ వినిపిస్తోంది. కానీ, సినిమా మొత్తంలో కేవలం ఓ 10 నుంచి 15 నిమిషాల మేరకు మాత్రమే తన పరిధి ఉందంటూ డిస్సప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. దేవర మూవీ రిలీజ్ రోజే (సెప్టెంబర్ 27) జాన్వీ నటించిన బాలీవుడ్ మూవీ 'ఉలజ్'(Ulajh) ఓటీటీలోకి వచ్చింది. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా జాన్వీ ‘ఉలజ్’ లో నటించింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 2024 ఆగస్ట్ 2న థియేటర్లలోకి వచ్చి డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ఉలజ్ నేడు శుక్రవారం సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం హిందీ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read :- ఓటీటీలో మోక్ష ఐలాండ్ మిస్టరీ చూశారా
In a world where every word is a lie and every step a risk, how far will she go for the pursuit of truth? Watch Ulajh, now on Netflix.#UlajhOnNetflix pic.twitter.com/SXffRxtNsV
— Netflix India (@NetflixIndia) September 27, 2024
అయితే, ఈ మూవీని దాదాపు రూ. 35 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన మేకర్స్కి భారీ నష్టాలను మిగిల్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.10 కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు రూ.25 కోట్ల వరకు నష్టాలను మిగిల్చి..డిజాస్టర్ లిస్ట్లో చేరింది.
మరోవైపు హిందీలో వరుస సినిమాలు చేస్తోంది జాన్వీకపూర్. అయితే తను నటించిన చిత్రాల్లో ఎక్కువ భాగం ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ జాన్వీ ఆరు సినిమాల్లో నటించగా, అందులో ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా: ద కార్గిల్ గర్ల్, గుడ్‌లక్ జెర్రీ, బవాల్ చిత్రాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. దీంతో ఆమెను బాలీవుడ్ ఓటీటీ స్టార్‌గా చెప్పుకుంటున్నారు. ఇక జాన్వీ తెలుగులో రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న RC16లో నటిస్తున్నట్లు సమాచారం.