కరోనా తరువాత ఇండియాలో ఓటీటీ(OTT) వాడకం బాగా పెరిగిపోయింది. అందుకే ఓటీటీ కంటెంట్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అంతేకాదు.. కొత్త కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే లోకల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలానే వచ్చాయి. అందులో.. కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమే ప్లే చేసే ఓటీటీలు కూడా పుట్టుకువచ్చాయి. వాటిలో ఉల్లు ఓటీటీ యాప్ ఒకటి. మాములు కంటెంట్ తో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ప్లే చేస్తూ.. ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది ఈ యాప్. ఎంతలా అంటే.. అడల్ట్ కంటెంట్ అంటే కేవలం ఉల్లు మాత్రమే గుర్తుకు వచ్చేంతలా.
అయితే.. ఉ ల్లు ఓటీటీ అధినేత విభు అగర్వాల్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇన్నాళ్లు అడల్ట్ కంటెంట్ ఓటీటీని నడిపిన ఆయన త్వరలో భక్తి కంటెంట్ తో రాబోతున్నారు. అవును.. హరి ఓం'(Hari Om) అనే పేరుతో కొత్త ఓటీటీని ప్రారంబిస్తున్నారట విభు అగర్వాల్. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశాడు. ఈ కొత్త ఓటీటీలో భక్తి, పురాణాలు, చరిత్ర, భక్తి కథలు వంటి ఫ్యామిలీ కంటెంట్ స్ట్రీమింగ్ చేయనున్నాడట. అతిత్వరలోనే ఈ ఓటీటీ అందుబాటులోకి రానుందని ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.