హైదరాబాద్లో వింత వాన.. 6 ఫీట్ల మందమే వర్షం

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్​లోని ఆసిఫ్ నగర్ ప్రాంతంలో వింత వర్షం కురిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫ్ నగర్ మురాద్ నగర్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో శుక్రవారం సాయంత్రం దట్టమైన మేఘం కమ్ముకుంది. అనంతరం ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఒక 6 ఫీట్ల మందమే ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనై మొబైల్స్​లో వీడియోలు తీశారు.