
న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్ జర్మనీకి చెందిన హైడెల్‌బర్గ్ గ్రూప్ ఇండియా బిజినెస్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా లిమిటెడ్‌లో హైడెల్‌బర్గ్ మెటీరియల్స్ గ్రూప్‌కు 69.39 శాతం వాటా ఉంది.
దీని విలువ సుమారు రూ.3,381 కోట్లు. చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలో అల్ట్రాటెక్‌కు, హైడెల్‌బర్గ్ సిమెంట్‌కు మధ్య డీల్ కుదరొచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. బిజినెస్‌ను మరింతగా విస్తరించడానికి ఇతర సిమెంట్ కంపెనీలను అల్ట్రాటెక్ కొనుగోలు చేస్తోంది.
కిందటేడాది ఇండియా సిమెంట్‌లో 55.49 శాతం వాటాను దక్కించుకుంది. స్టార్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాను కొనుగోలు చేసింది.