న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ.1,688 కోట్ల నికర లాభం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో వచ్చిన లాభం రూ.1,584 కోట్లతో పోలిస్తే ఇది ఏడుశాతం ఎక్కువ.
ఇదేకాలంలో నికర అమ్మకాలు రూ.15,007 కోట్ల నుంచి రూ.17,519 కోట్లకు పెరిగాయి. కెపాసిటీ యుటిలైజేషన్క్వార్టర్లీగా 83 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. దేశీయ మార్కెట్ అమ్మకాలు వార్షికంగా 20 శాతం పెరిగాయి. గ్రే సిమెంట్ తయారీ సామర్థ్యం 131.25 మిలియన్ టన్ పర్ యానమ్(ఎంటీపీఏ)లకు చేరుకుంది.