న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.825.18 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.1,280.38 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. రెవెన్యూ రూ.16,012.13 కోట్ల నుంచి రూ.15,634.73 కోట్లకు పడిపోయింది. ఆగస్టులో భారీ వర్షాల కారణంగా సిమెంట్ కంపెనీల సేల్స్ పడిపోయాయి.
అల్ట్రాటెక్ సిమెంట్ రెవెన్యూ కూడా తగ్గింది. కంపెనీ షేర్లు సోమవారం 1.69 శాతం తగ్గి రూ.10,874 వద్ద సెటిలయ్యాయి. కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్‌ను తయారు చేసే యూఏఈ కంపెనీ రస్ అల్‌ఖైమాలో వాటాను 54.79 శాతానికి పెంచుకున్నామని, దీంతో కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో తాజా ఫలితాలను పోల్చకూడదని అల్ట్రాటెక్ పేర్కొంది.