- డీల్ విలువ రూ. 1,900 కోట్లు
న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్స్ చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌లో 23 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఇందుకోసం రెండు విడతల్లో రూ. 1,900 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపింది. ఇండియా సిమెంట్స్‌కు చెందిన 6,02,48,983 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ. 267 చెల్లించి 19.44 శాతం వాటాను కొన్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఒక్కో షేరు ధర రూ.267 వద్ద జరిగిన మొదటి లావాదేవీ విలువ రూ.1,608.64 కోట్లుగా నిర్ణయించారు. ఒక్కో షేరుకు రూ.285 వరకు ధరలో 3.4 శాతం వరకు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ప్రత్యేక సమావేశంలో ఆమోదం తెలిపింది. రెండో లావాదేవీ విలువ రూ.295 కోట్లు.