
న్యూఢిల్లీ:సిమెంటు తయారీ కంపెనీ అల్ట్రాటెక్.. వైర్లు, కేబుల్స్బిజినెస్లోకి ప్రవేశిస్తున్నది. ఇందుకోసం రాబోయే రెండేళ్లలో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తామని తెలి పింది. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి కార్యకలాపాలు మొదలవుతాయి. గుజరాత్‌లోని భరూచ్‌లో ప్లాంటు నిర్మిస్తారు.
కన్స్ట్రక్షన్బిజినెస్లో తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్మంగళమ్ బిర్లా చెప్పారు. మనదేశంలో వైర్లు, కేబుల్స్ బిజినెస్ 2019 నుంచి 2024 మధ్య ఏటా 13 శాతం వృద్ధిని సాధించింది.