
21 శాతం వరకు పతనం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్స్ వైర్స్, కేబుల్స్ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇస్తామని ప్రకటించడంతో ఈ సెక్టార్‌లోని కంపెనీల షేర్లు గురు వారం భారీగా పడ్డాయి. కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు 21 శాతం నష్టపోగా, ఆర్‌ఆర్ కేబుల్ 20 శాతం, పాలికాబ్ 19 శాతం, యూనివర్సల్ కేబుల్స్ 7 శాతం, ఫినోలెక్స్ కేబుల్స్ 6 శాతం, హావెల్స్ ఇండియా 6 శాతం, పారామౌంట్ కమ్యూనికేషన్స్ 6 శాతం నష్టపోయాయి.
ఈ కంపెనీలు కలిసి రూ.2.50 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను గురువారం ఒక్కరోజే కోల్పోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్ రూ.1,800 కోట్ల పెట్టుబడితో వైర్లు, కేబుల్స్ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తామని ప్రకటించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి కార్యకలాపాలు మొదలు పెడతామని పేర్కొంది.
ఇందుకోసం గుజరాత్‌లో ప్లాంట్ పెట్టనుంది. మరోవైపు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ఫ్లాట్‌గా కదిలాయి. సెన్సెక్స్ 10 పాయింట్లు పెరిగి 74,612 వద్ద, నిఫ్టీ 3 పాయింట్లు తగ్గి 22,545 వద్ద సెటిలయ్యాయి.