వీడియో: ఏమా అంపైరింగ్..! సొంతం సినిమాలో సునీల్ చెప్పిన ఘనుడు ఇతనే!

వీడియో: ఏమా అంపైరింగ్..! సొంతం సినిమాలో సునీల్ చెప్పిన ఘనుడు ఇతనే!

ఆర్యన్ రాజేష్, నమిత జంటగా నటించిన సొంతం మూవీ గుర్తుందా..! ఆ సినిమా కథాంశం పక్కనపెడితే, అందులో సునీల్ కామెడీ మాత్రం మరో లెవెల్ అని చెప్పుకోవాలి. భోగేశ్వర్ రావుగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెంకట లక్ష్మిగా ఝాన్సీ, శేషంగా మన సునీల్ కడుపుబ్బా నవ్వించారు. ఇప్పటికీ నలుగురు స్నేహితులు ఒక్కచోట చేరారంటే ఆ సినిమా చూడాల్సిందే. వెంకట లక్ష్మిగతో శేషం సంభాషణ, ఆ డైలాగ్స్ .. అబ్బో ఆ సినిమా చూస్తూ ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చనే చెప్పుకోవాలి. 

ఆ సినిమాలో 'కళ్లు కనపడని వారిని ఏం చేస్తారు..' అని కాలేజీలో లెక్చరర్ అయిన వెంకట లక్ష్మి.. శేషం(సునీల్)ని అడుగుతుంది. అప్పుడు అతను 'అది కూడా తెలియదా వెంకట లక్ష్మి..! అంపైర్లను చేస్తారు.." అంటూ ఠక్కున సమాధానమిస్తాడు. ఆ సమయంలో ఈ డైలాగ్ కాస్త అనిపించినా.. ఇన్నాళ్లకు దానికి న్యాయం జరిగింది. సినిమాలో సునీల్ చెప్పిన పాత్రకు తగ్గట్టుగానే ఓ అంపైర్ తెరమీదకు వచ్చారు. మీరూ అతన్ని ఓసారి చూడండి.

ఏం జరిగిందంటే..?

అండర్-23 కల్నల్ సికె నాయుడు ట్రోఫీ ఫైనల్‌లో భాగంగా కర్నాటక, ఉత్తరప్రదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓపెనర్ ప్రఖర్ చతుర్వేది వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. నిజం చెప్పాలంటే అంపైరే.. అతన్ని ఔట్ చేశాడు. వికెట్ కీపర్ బంతిని జాఝరవిడిచినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. గుడ్డిగా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. పోనీ, క్యాచ్ క్లీన్‌గా తీసుకోలేదని రీప్లేలో తేలిన తర్వాత అతన్ని మ్యాచ్ అధికారులు వెనక్కి పిలవలేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో భారత దేశవాళీ క్రికెట్‌లో అంపైరింగ్ స్థాయి ఎలా ఉందో ఒక్కసారిగా బట్టబయలైంది.

వికెట్ కీపర్‌పై నిషేధం

క్యాచ్ తీసుకోనప్పటికీ.. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదారి పట్టించిన వికెట్ కీపర్‌పై రెండేళ్ల నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, సదరు అంపైర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరికొందరైతే ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపిస్తున్నారు.