థర్డ్ అంపైర్ మాట నేను వినను.. ఆశ్చర్యపరిచిన మహిళా అంపైర్ నిర్ణయం

థర్డ్ అంపైర్ మాట నేను వినను.. ఆశ్చర్యపరిచిన మహిళా అంపైర్ నిర్ణయం

ఫీల్డ్ అంపైర్లు పొరపాట్లు చేయడం సహజమే. తమకున్న అనుభవంతో అంచనా వేసి చెప్పడం తప్ప ఎవరూ కూడా 100 శాతం కరెక్ట్ గా చెప్పలేరు. వీరి నిర్ణయాలు చాలా వరకు సరిగానే ఉన్నా.. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లను దురదృష్టం వెంటాడుతుంది. అయితే డీఆర్ఎస్ వచ్చి తర్వాత మొత్తం మారిపోయింది. రివ్యూ తీసుకోవడం ద్వారా థర్డ్ అంపైర్ నిర్ణయంతో ఇరు జట్లకు న్యాయం జరుగుతుంది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఒక మహిళా అంపైర్ వ్యతిరేకించింది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో అంపైర్ నిర్ణయం ఆశ్చర్యపరించింది. స్పిన్నర్ గార్డనర్ వేసిన 24 ఓవర్ చివరి బంతి బ్యాటర్ సునే లూస్ ప్యాడ్లకు తాకింది. ఆన్-ఫీల్డ్ అంపైర్ క్లైర్ పొలోసాక్ దీనిని నాటౌట్ గా ప్రకటించింది. అయితే ఆసీస్ ఆటగాళ్లు రివ్యూ కు వెళ్లారు. బంతి వికెట్లను మిస్ అవుతుండడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించమని చెప్పాడు. అయితే ఆన్-ఫీల్డ్ అంపైర్ క్లైర్ పొలోసాక్ మాత్రం ఔట్ అన్నట్లుగా తన నిర్ణయాన్ని తెలియజేసింది. ఆ వెంటనే తేరుకొని నాటౌట్ గా ప్రకటించింది. 

అంపైర్ చేసిన పనికి గ్రౌండ్ లో ప్లేయర్లందరూ పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఆ తర్వాత ఓవర్‌లో లూస్ వికెట్ ను గార్డనర్ తీసుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో డక్ వార్త లూయిస్ పద్ధతిలో సౌతాఫ్రికా 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. 45ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 45 ఓవర్లలో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 149 పరుగులకే ఆలౌటైంది.