నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతోన్న టీ20 ప్రపంచకప్ శనివారం (జూన్ 29) ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. 20 జట్లతో మొదలైన ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. మొదటి సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసి సౌతాఫ్రికా ఫైనల్ కు చేరుకుంటే.. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్ గ్రాండ్ గా జరగనుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఐసీసీ మ్యాచ్ అఫీషియల్స్ ను ప్రకటించారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్లు, రిఫరీలు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), క్రిస్ గఫానీ (న్యూజిలాండ్) ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవరించనున్నారు. రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్) థర్డ్ అంపైర్‌గా ఉంటారు. నాలుగో అంపైర్ గా రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా)ను ఎంపిక చేశారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. మొబైల్స్ లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
ఓటమెరుగని జట్లుగా భారత్, సౌతాఫ్రికా:
టీ20 వరల్డ్ కప్ లో 2024 లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. గ్రూప్ దశలో భారత్ మూడు మ్యాచ్ లు గెలిస్తే వర్షం కారణంగా కెనడాతో మ్యాచ్ రద్దయింది. సూపర్ 8 లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాలపై గెలిచిన రోహిత్ సేన అదే ఊపులో సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. మరోవైపు దక్షిణాఫ్రికా గ్రూప్ దశలో నాలుగు విజయాలతో టాప్ లో నిలిచింది. సూపర్ 8లో అదే జోరు కొనసాగించిన సఫారీలు టేబుల్ టాపర్ గా నిలిచారు. సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టారు.
🚨T20 World Cup Final match officials🚨
— Lawrence Bailey ⚪ 🇿🇦 (@LawrenceBailey0) June 28, 2024
On field umpires: Chris Gaffaney 🇳🇿 & Richard Illingworth 🏴
TV umpire: Richard Kettleboroug 🏴
4th umpire: Rod Tucker 🇦🇺 #T20WorldCupFinal #SAvIND pic.twitter.com/nm7EXRlj9J