వ్యాక్సిన్​ అందరికీ అందాలి

ఈ విషయంలో రిచ్​ కంట్రీస్​ పద్ధతి బాలేదు

యూఎన్​ చీఫ్​ గుటెరస్​

యునైటెడ్​ నేషన్స్​: కరోనా వ్యాక్సిన్​ తమ ప్రజలకు అందితే చాలన్నట్టు సంపన్న దేశాల వైఖరి ఉందని, పేద దేశాల గురించి పట్టించుకోవడం లేదని యూఎన్‌ చీఫ్​ ఆంటోనియో గుటెరస్​ అన్నారు. పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్​ ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆఫ్రికాలో ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా వ్యాక్సిన్ వేయాలని స్పష్టం చేశారు. పేదలకు వ్యాక్సిన్ అందించడానికి చేపట్టిన కోవాక్స్​ ప్రోగ్రామ్ కోసం డబ్ల్యూహెచ్ఓకు  4.2 బిలియన్​ డాలర్లు ఇవ్వాలని కోరారు. వర్చువల్​ మీటింగ్​ ద్వారా ఆయన ఆఫ్రికన్​ యూనియన్ లీడర్లతో సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆఫ్రికన్లకు వ్యాక్సిన్​ దొరకాలంటే కోవాక్స్​ ప్రోగ్రామ్​ ఒక్కటే మార్గమని అన్నారు. వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తే, తాను అందరిముందే వేయించుకుంటానని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఇలా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుటెరస్​ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్​, రష్యా దేశాల్లో ఇది వరకే వ్యాక్సిన్ డ్రైవ్​​ మొదలైంది.

For More News..

‘నీట్​2021’ను రద్దు చేయం

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన పార్థివ్‌‌కు సూపర్ ఆఫర్