యుగాంతం అప్పుడేనట.. తేల్చి చెప్పిన సైంటిస్టులు...

2050 కల్లా  యుగాంతం అంతమవుతుందా...  డైనోసార్స్ మాదిరిగా  మనుషులు కూడా అంతరించిపోతారా? నిజంగా యుగాంతం జరుగుతుందా?మరో ముప్పై ఏళ్ల లోనే.. సివిలైజేషన్ అంతరించిపోతుందా...  వీటి విషయంలో ఏదయినా జరగవచ్చని  అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. ఇంతకూ ఇప్పటి వరకు భూమిపై ఏంజరిగింది.. భవిష్యత్తులో ఏం జరగబోతుంది.  పర్యావరణ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రిస్టోరేషన్  సంస్థ నివేదికలో ఏముందో తెలుసుకుందాం....

చావు అంటే అందరికీ భయమే.ఈ భూమిమీద జీవించే ప్రతి ప్రాణికీ ప్రాణ భయం ఉంటుంది. అదే మొత్తం ప్రపంచం మన కనుల ముందు అంతం  అయిపోతుందంటే అది చూసి తట్టుకోవడం మానవుని వలన కాదు.అదేగాని నిజమైతే ముందే మరణాన్ని ఆహ్వానిస్తాం.ఇంతకీ ఈ సోదంతా ఎందుకని అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నా...నేటి ప్రపంచ పరిస్థితులు చూస్తే అతి త్వరలోనే యుగాంతం వస్తుందేమో అనే అనుమానం కలగక మానదు. ప్రపంచ సైంటిస్టులు కూడా అది నిజమే కావచ్చు అంటున్నారు. భూమికి, భూమి మీద ఉన్న మనకి త్వరలో పెద్ద ప్రమాదమే పొంచి ఉందట. వాతావరణ మార్పుల కారణంగా త్వరలో సివిలైజేషన్ అనేదే లేకుండా పోతుందని ఆస్ట్రేలియాకు చెందిన  నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రిస్టోరేషన్  సంస్థ  తెలిపింది.

భూగోళం మండుటెండతో భగ్గు మంటుంది.ఓవైపు పొల్యూషన్ ఉండనే ఉంది.పట్టణాలలో వాతావరణం చాలా దారుణంగా ఉంది.ఇక ఈ భూతాపం వలెనే ప్రపంచం అంతం కాబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాగా.2050 నాటికి  భూమిపై ఉష్ణోగ్రతలు 5 కోట్ల రెట్లు పెరుగుతాయని ఆస్ట్రేలియాకు చెందిన  నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రిస్టోరేషన్  సంస్థ పేర్కొంది. అలాంటి వేడి వాతావరణంలో మనుషులు, చెట్లు, ప్రాణులు జీవించే అవకాశమే ఉండదంటున్నారు. అప్పుడు 2050 నాటికి యుగాంతం తప్పదని వారు అంటున్నారు.భూమిపై గ్రీన్ హౌస్ వాయువుల్ని తగ్గించకపోతే మాత్రం, భూతాపాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుందని వారు అంటున్నారు.

ప్రస్తుత గ్రీన్ హౌస్ వాయువులు గాని కంట్రోల్ అవ్వకపోతే....2050 నాటికి  చూడనంత ఎక్కువ ఉష్ణోగ్రతలను చూడవలసి వస్తుంది అని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఓ పరీక్ష చేశారు. సముద్ర గర్భంలోని ఓ శిలాజాన్ని తవ్వి తీసి, డైనోసార్ల కాలంలో భూమిపై ఉష్ణోగ్రత ఎంత ఉండేదో దాని ద్వారా తెలుసుకొని, ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయో గ్రహించారు.

వేడి పెరుగుతోంది

వాతావరణ మార్పుల వల్ల భూమి మీద టెంపరేచర్ పెరిగి భవిష్యత్తులో తొంభై శాతం మంది మనుషులు అంతరించిపోయే ప్రమాదం ఉందనేది ఆ నివేదిక సారాంశం. ప్రపంచవ్యాప్తంగా.. వచ్చే 30 ఏళ్లలో మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయట.  దాంతో సముద్ర తీరాన ఉన్న ఫ్లోరిడా, షాంగై, లాగోస్, ముంబై లాంటి మహా నగరాలు సముద్రంలో మునిగిపోతాయట. అలాగే పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల 90 శాతం మంది జనాభా కూడా అంతరించిపోతారని  నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రిస్టోరేషన్  సంస్థ వెల్లడించింది. 

ఇంకా పెరిగితే..

సమ్మర్​ సీజన్​ లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పరిమితికి మించి ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగితే సముద్ర మట్టాలు ....  పెరిగి భూమి మీద చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయి. అందుకే భూమి మీద వేడి పెరగకుండా కంట్రోల్ చేయగలిగితే కొంత వరకైనా నష్టాన్ని నివారించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.  అంటే   కేవలం ఒకటిన్నర డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెరిగితేనే మనం ముప్పులో పడతాం. అలాంటిది భవిష్యత్తులో రెండు డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉంది. ఇంకొన్నాళ్లకు భూమి మీద ఉండటం అంటే... పూర్తిగా మంటల్లో ఉన్నట్లే ఉంటుంది  అన్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. 

మంచు కరిగితే...

భూతాపం పెరిగితే మంచు కరిగే వేగం మరింత పెరుగుతుంది. మన భూమ్మీద పర్వత ప్రాంతాలు చాలానే ఉన్నాయి. టెంపరేచర్ను తగ్గించుకోపోతే ఆ పర్వతాల్లోని మంచంతా కరిగి పర్వతాలు బరువు తగ్గడం వల్ల  భూకంపాలు కూడా వస్తాయి. దాంతో దాదాపు మనుషులంతా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదంటోంది ఆ సంస్థ.పెరుగుతున్న వేడివల్ల క్రమక్రమంగా భూమిపైనున్న మంచు కరుగుతోందని పర్యావరణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా  కరిగిన మంచు నీరు నదులకు.. సముద్రాలకు చేరుతుంది. దీంతో సముద్ర మట్టాలు పెరిగి వరదలు ముంచెత్తి... కొన్ని చిన్న ద్వీపాలు మునిగిపోతాయి. ఇలానే ఉష్ణోగ్రలు ఎక్కువ అయితే ఆఖరికి ధృవ ప్రాంతాలలో కూడా మంచు కరిగిపోతోంది. దీంతో అంటార్కిటికాలో ఏటా వంద బిలియన్ టన్నుల మంచు కరిగి సముద్రంలోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. 

తేనెటీగలు లేకపోతే..

వాతవరణంలో మార్పు కేవలం ప్రజలనే కాదు.. భూమిమీద ఉండే అన్నీ జీవరాశులను ప్రభావితం చేస్తుంది.  భూమిమీద కొన్ని రకాల కీటకాలు, పురుగులు రానురానూ మాయమవుతున్నాయి. వీటితో పాటు కొన్నిపక్షి జాతులు కూడా! ఎందుకంటే, అంతరిస్తున్న కీటకాల మీదే ఆ పక్షి జాతులు కూడా ఆధారపడి ఉన్నాయి.  దీనికి మనుషుల జీవితానికి కూడా సంబంధం ఉందంటున్నారు. ఒకవేళ భూమి మీద తేనెటీగలు అంతరించిపోతే.. నాలుగేళ్లలో మనిషి కూడా అంతరించి పోతాడని   నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రిస్టోరేషన్  సంస్థ  నివేదిక ద్వారా తెలుస్తోంది.   ఈ విషయం చెప్పింది కూడా ది గ్రేట్ సైంటిస్ట్ ఐన్​ స్టీన్. తేనెటీగలు లేకపోతే పుప్పొడి వ్యాప్తి జరగదు. దాంతో మొక్కలు పెరగవు. జంతువులుండవు. అలాగే చివరకి మనిషి కూడా ఉండడని ఐన్​ స్టీన్ ఎప్పుడో చెప్పారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు భూమిమీద తేనెటీగల సంఖ్య కూడా తగ్గిపోతోంది. రానురాను ఇంకా తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు.

క్లైమేట్ ఛేంజ్

ఈ మధ్య కాలంలో  క్లైమేట్ ఛేంజ్ అనే మాట  బాగా వినిపిస్తుంది. క్లైమేట్ ఛేంజ్ అంటే.. వాతావరణంలో విచ్చలవిడిగా మార్పులు రావడం, కాలాలు, రుతువులు వాటి టైమింగ్స్ తప్పడం. భూమి తిరగడంలో మార్పులు వచ్చినప్పుడు కాలాలు, రుతువుల్లో మార్పు ఉంటుంది. కానీ భూమి తిరగడంలో ఎటువంటి మార్పు లేదు. అయినా ధృవాల్లో మంచు కరుగుతుంది. సముద్రాల్లో నీరు పెరుగుతుంది. ఇదంతా వాతావరణ మార్పుల వల్లే జరుగుతుంది. ఈ మార్పులు మనుషుల లైఫ్ స్టైల్ మీద, శారీరక మానసిక ఆరోగ్యంపై పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి.

ఎఫెక్ట్ ఎలా?

వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల  టెంపరేచర్లో విపరీతంగా మార్పులొస్తాయి. దాంతో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి, ఫుడ్ సైకిల్లో మార్పులొస్తాయి. మనుషులు అనారోగ్యానికి గురవుతారు. అలా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి. ఇంకా వాతావరణ మార్పుల వల్ల పర్వత ప్రాంతాల్లో కొండలు విరిగిపడటం, మంచు పర్వతాలు కరిగిపోవడం, వరదలు రావడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పుల వల్ల సముద్రమట్టాలు కూడా పెరుగుతాయి. ఎటు చూసినా ఏదో పెద్దనష్టమే జరిగేలా కనిపిస్తుంది.

ఇంతకీ మనమేం చేయాలి?

  •  మనజీవితాలను మనం కాపాడుకోవాలంటే.. మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి.
  •  మాంసం, పాలు, వెన్న వంటి ఉత్పత్తులను కొనడం తగ్గించాలి. అలాగే వాటిని వృథాగా పారబోయడమూ తగ్గించాలి.
  •  ఇంధనాన్ని వినియోగించడం తగ్గించాలి. తక్కువ దూరాలు నడుచుకుంటూ లేదంటే సైకిళ్లపై వెళ్లాలి. ఎక్కువ దూరాల ప్రయాణానికి ఎలక్ట్రిక్ కార్లను వాడాలి.* విమాన ప్రయాణాలు తగ్గించుకుని బస్సులు, రైళ్లలో రాకపోకలు సాగించాలి.
  •  దుస్తులు ఎండబెట్టేందుకు డ్రయ్యర్లను వాడేకంటే చక్కగా తాడుకట్టి దానిపై ఆరబెట్టడం మంచిది.
  • కొనే ప్రతి వస్తువూ కార్బన్ రహితమో కాదో చూసుకోవాలి. కనీసం తక్కువ కార్బన్ను విడుదలచేసేది అయ్యుండేలా అయినా జాగ్రత్తపడాలి.

ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే..

  •  2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఎమిషన్స్ 45 శాతం తగ్గాలి.
  •  2050 నాటికి 85 శాతం రెన్యువబుల్ విద్యుత్​ను వాడాలి.
  •  బొగ్గు వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి.
  •  ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ చదరపు కిలోమీటర్లలో ఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలు ఉండాలి. అంటే సుమారు ఆస్ట్రేలియా దేశం మొత్తం ఎంత  విస్తీర్ణం ఉందో... అంత విస్తీర్ణంలో  జీవఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలను సాగు చేయాలి.
  • 2050 నాటికి కార్బన్ ఎమిషన్స్  జీరోకి తీసుకురావాలి