- ‘సోనీ గోల్డ్’ జింజర్ గార్లిక్ పేస్ట్ తయారీ కేంద్రం సీజ్
- 8 మంది అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్బోయిన్పల్లిలో భారీ మొత్తంలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్దొరికింది. అక్రమంగా నిల్వచేసిన 1,500 కిలోల కల్తీ పేస్ట్‌ను, రూ.4.50 లక్షల విలువ చేసే ఇతర సామాగ్రిని నార్త్జోన్టాస్క్ ఫోర్స్పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నార్త్జోన్టాస్క్ఫోర్స్డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన మహ్మద్షకీల్అహ్మద్ ఓల్డ్‌బోయిన్‌పల్లి రాజరాజేశ్వరినగర్‌లో ‘సోనీ గోల్డ్’ పేరుతో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.
బోయిన్‌పల్లికి చెందిన మహ్మద్సమీర్అన్సారీ(33), మహ్మద్ గుల్ఫ్రాజ్(32), మహ్మద్ ముఖ్తార్(27), రంజిత్ కుమార్(19), మోను కుమార్(20), బిర్వల్సా(19), ఇనాయత్(32), మహేశ్‌కుమార్(20) అనే ఎనిమిది మంది అందులో పనిచేస్తున్నారు. అక్కడ తయారుచేసిన కల్తీ పేస్ట్ ను డబ్బాల్లో, ప్యాకెట్లలో నింపి బ్రాండెడ్కంపెనీల లేబుల్స్అంటిస్తున్నారు. సిటీలోని ప్రముఖ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు.
ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో సిట్రిక్యాసిడ్కలుపుతున్నారు. సమాచారం అందుకున్న నార్త్జోన్టాస్క్ఫోర్స్పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు కలిసి తయారీ కేంద్రంపై దాడులు చేసి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిల్వ ఉంచిన1,500 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టును, 55 కిలోల సిట్రిక్యాసిడ్ను, 40 కిలోల కుల్లిన వెల్లుల్లిని, బ్రాండెడ్కంపెనీల పేరుతో ఉన్న లేబుళ్లు, డేట్స్టాంపులను, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు మహ్మద్షకీల్అహ్మద్పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ సుధీంద్ర వెల్లడించారు.