ఏం జరుగుతుంది ప్రపంచంలో : ఐక్యరాజ్య సమితిలో 20 శాతం మంది ఉద్యోగుల తొలగింపు..?

ఏం జరుగుతుంది ప్రపంచంలో : ఐక్యరాజ్య సమితిలో 20 శాతం మంది ఉద్యోగుల తొలగింపు..?

లేఆఫ్స్.. ఐటీ సెక్టార్ లో ఎక్కువగా ఈ పదం వింటుంటాం.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది, సెక్టార్ తో సంబంధం లేకుండా అన్ని రంగాల్లో లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, దూసుకొస్తున్న ఏఐ ఇలా... కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్లు పెరుగుతున్న లేఆఫ్స్ కి కూడా చాలా కారణాలున్నాయి. ఇదిలా ఉండగా.. ఐక్యరాజ్య సమితి కూడా లేఆఫ్స్ బాట పట్టింది.. ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో 20శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ఐక్యరాజ్య సమితిలో నిధుల కొరతే లేఆఫ్స్ కి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి విభాగమైన ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ అఫ్ హ్యూమానిటేరియన్ అఫైర్స్ ( OCHA ) లో ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు స్వయాన ఆ విభాగం అధిపతి ఫ్లెచర్ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.కేమెరూన్, కొలంబియా, ఎరిటేరా, ఇరాక్,లిబియా, నైజీరియా, పాకిస్తాన్, టర్కీ, జింబాబ్వే దేశాల్లో లేఆఫ్స్ చేపట్టనున్నట్లు తెలిపారు ఫ్లెచర్ తెలిపారు. 

60 మిలియన్ డాలర్ల నిధుల కొరత:

ఈ ఏడాది OCHA 60 మిలియన్ డాలర్ల నిధుల కొరత ఎదుర్కొంటోందని.. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా తమ సేవలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు ఫ్లెచర్. అందుకే లేఆఫ్స్ చేపట్టాక తప్పట్లేదని ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు ఫ్లెచర్. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల తమ సేవలను కుదిస్తున్నామని.. ఒక్కో చోట 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం ఉండనుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2, 600 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు ఫ్లెచర్.

అనుబంధ సంస్థలపై ఎఫెక్ట్:

OCHA లేఆఫ్స్ నిర్ణయం పట్ల అనుబంధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై స్పందించిన బాగ్దాద్ కు చెందిన అల్ అమల్ అసోసియేషన్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. OCHA లేఆఫ్స్ ఇరాక్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని.. ముఖ్యంగా మానవ హక్కులు, మహిళల హక్కుల కోసం పనిచేసే సంస్థలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అన్నారు. OCHA లేఆఫ్స్ కారణంగా తమ సంస్థలో కూడా ఉద్యోగులను తొలగించాల్సి రావచ్చని హెచ్చరించారు.

►ALSO READ | Election Commission: ఈవీఎంలపై తులసీ గబ్బార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎలక్షన్ కమిషన్ క్లారిటీ..