ఇండియా ఎకానమీ వృద్ధి 6.6 శాతమే: యూఎన్‌‌

న్యూఢిల్లీ: ఇండియా ఎకానమీ ఈ ఏడాది 6.6 శాతం వృద్ధి చెందుతుందని యూనైటెడ్ నేషన్స్ (యూఎన్‌‌) ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. వినియోగం, పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు మద్ధతుగా నిలుస్తాయని అంచనా వేసింది. 

మొత్తం సౌత్‌‌ ఈస్ట్‌‌ ఏషియాపై యూఎన్ పాజిటివ్‌‌గా ఉంది. ఈ ఏరియాలో ఆర్థిక వృద్ధి 2025 లో 5.7 శాతంగా, 2026 లో  6 శాతంగా ఉంటుందని యూఎన్ రిపోర్ట్‌‌ వివరించింది. భూటాన్‌‌, నేపాల్‌‌, శ్రీలంక ఆర్థిక వ్యవస్థలు రికవర్ అవుతాయని తెలిపింది. 

ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియా ఎకానమీ 2024 లో 6.8 శాతం వృద్ధి చెందింది. 2025 లో 6.6 శాతం మేర పెరుగుతుందని అంచనా. 2026లో 6.8 శాతం గ్రోత్ నమోదు చేస్తుంది.  సర్వీసెస్‌‌, కొన్ని రకాల వస్తువుల ఎగుమతులు ఇండియా నుంచి పెరిగాయి. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్‌‌, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు ఊపందుకున్నాయి. ఇండియా ఎకానమీకి పెరుగుతున్న ఎగుమతులు మద్ధతుగా ఉన్నాయి. 

ఈ ఏడాది ఇబ్బందే: ఐఎంఎఫ్‌‌

ఈ ఏడాది ఇండియా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు లేకపోలేదని ఐఎంఎఫ్‌‌ ఎండీ క్రిస్టలినా జార్జీవా అన్నారు. యుఎస్ ట్రేడ్ పాలసీపై అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు.  గ్లోబల్‌‌ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది నిలకడగా ఉంటుందని అంచనావేశారు. ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం కొంత బలహీనపడొచ్చని తెలిపారు. కానీ, ఎందుకు బలహీనపడుతుందో  వివరించలేదు.