ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్AI పై UN భద్రతా మండలి తొలిసారి చర్చలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్AI పై UN భద్రతా మండలి తొలిసారి చర్చలు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై అధికారికంగా చర్చించనుంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ, అంతర్జాతీయ భద్రతపై AI ప్రభావం గురించి అంతర్జాతీయ చర్చకు బ్రిటన్ పిలుపునిచ్చిన నేపథ్యలో  ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​పై భద్రతా మండలి చర్చించనుంది.  AI సాంకేతికత ప్రమాదాల నివారణ చర్యలు అన్ని  దేశాలు కోరుతున్న నేపథ్యంలో.. AI నియంత్రణలో ప్రపంచ నాయకత్వం అవసరాన్ని  యూఎన్​ భద్రతామండలిలో శాశ్వత సభ్యత దేశం బ్రిటన్​ కోరింది. 

మంగళవారం జరిగే ఈ చర్చకు బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ అధ్యక్షత వహించనున్నారు. జూన్‌లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) వంటి అంతర్జాతీయ AI వాచ్‌డాగ్ బాడీని సృష్టించడం కోసం కొంతమంది కృత్రిమ మేధస్సు అధికారులు చేసిన ప్రతిపాదనకు UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మద్దతు ఇచ్చారు.